కారు కోరిక కడతేర్చింది
close

తాజా వార్తలు

Updated : 07/09/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారు కోరిక కడతేర్చింది

తాత చేతిలో మనవడి హతం

బేస్తవారపేట, న్యూస్‌టుడే: కారు కొనుగోలుకు డబ్బులివ్వండి.. తన వాటాగా వచ్చే పొలమైనా పంచి ఇవ్వండి కొనుక్కుంటాను. లేకుంటే కుటుంబ సభ్యులందరినీ చంపేస్తాను...’ అంటూ ఓ మనవడు చేస్తోన్న వేధింపులను తాత తట్టుకోలేక పోయారు. రాత్రి వేళ పక్కనే నిద్రించిన అతనిపై రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. ఈ ఉదంతం బేస్తవారపేట మండలంలోని ఖాజీపురంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ సుధాకరరావు తెలిపిన మేరకు.. ఖాజీపురానికి చెందిన పూనూరు రాఘవేంద్రారెడ్డి(21) మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడే పనిచేసుకుంటూ ఉండేవాడు. ఫిబ్రవరి నెలలో స్వగ్రామానికి తిరిగి వచ్చి తల్లిదండ్రులు వరమ్మ, చిన్న వెంకటరెడ్డి వద్ద ఉంటున్నాడు. మద్యం, ఇతర చెడు అలవాట్లకు లోనయ్యాడు. డబ్బుల కోసం ఇంట్లో వాళ్లను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీవల కారు కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇంట్లో వారితో ఘర్షణకు దిగుతున్నాడు. కారు కొనేందుకు అవసరమైన డబ్బులివ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. తన వాటాగా వచ్చే పొలమైనా పంచి ఇవ్వాలని.. అప్పుడు కొనుక్కుంటానని కోరాడు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రారెడ్డి శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి తాత ఓసూరరెడ్డి ఇంట్లో అతని పక్కనే నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో పక్క మంచంలోనే పడుకున్న ఓసూరరెడ్డి సమీపంలోని రోకలి బండతో రాఘవేంద్రారెడ్డి తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతునికి వివాహం కాలేదు. నిందితుడు ఓసూరరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. సీఐ సుధాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని