
తాజా వార్తలు
‘గోడవాలు’గా....ఓ తోటను పెంచెయ్!
ఇంటర్నెట్ డెస్క్ : దేశవ్యాప్తంగా జనాభా పెరగటంతో ఆధునిక జీవన విధానంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇంటి మిద్దెలే వ్యవసాయ క్షేత్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం మిద్దెపై ఏర్పాటు చేసేవే కాకుండా ఇంటి ప్రహరీలపై ఎకబాకే నిలువు తోటలు వేస్తున్నారు. ఈ రకమైన తోట పెంపకాలు నగరాల్లో శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ గోడ వాలు తోటలు చూసేవారికి అందంగా కనిపించటమే కాకుండా వాతావరణంలో వేడి ప్రభావం, కాలుష్యాన్ని నివారించటం వంటి వాటిలో సహాయ పడుతున్నాయి. అంతేకాదు ఇంటి సౌందర్యాన్ని పెంచుతున్నాయి. స్థలం లేదన్న బాధే ఉండదు. ఈ తోటల్లో కూరగాయలు కూడా పండించవచ్చు.
నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు ఇంటి పరిసరాల్లో గాలి నాణ్యతను పెంచుకోవటానికి, శబ్ద కాలుష్యాన్ని తగ్గించుకోవటానికి, ఆహార వనరులను పొందటానికి ఈ నిలువు తోటలు ఎంతో ఉపయోగకరం. ఈ తోటలను పెంచటానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యకాంతి పడే ప్రదేశాలను ఎంచుకోవాలి. తోట వేయాలనుకున్న గోడల ఎత్తు తదితరాలను ముందుగా అంచనా వేసుకోవాలి. వాటికి అనుగుణంగా నిలువు పాటి ఇనుప జాలి వంటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి పాస్టిక్ బకెట్లు, బాటిళ్ల వంటివి అమర్చాలి. వాటిలో సారవంతమైన మట్టిని నింపాలి. వీటిల్లో ఆకుకూరలు, టమాట, పుదీనా, కొత్తిమీరా వంటివి పండించుకోవచ్చు. ఈ రకమైన తోటల పెంపకం చేపట్టే కొందరు గోడల నాణ్యత దెబ్బతినకుండా సిరామిక్ ఫలకలు అతికిస్తున్నారు.
‘హోం కమ్ ఆఫీస్’ గురించి తెలుసా?
కరోనా విజృంభణ, లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో చాలమంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆఫీస్ కమ్ హోం సౌలభ్యం ఉండే అపార్ట్మెంట్లకు ప్రాధాన్యత ఉంటుందని, కనీసం 20 శాతం మంది ఉద్యోగులు ఇలాంటి వాటిలో ఉండేందుకు ఆసక్తి చూపుతారన్నది ఓ అంచనా. అందువల్ల భవన నిర్మాణ రూపకల్పనలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారణంగా ఇప్పటి వరకు అపార్టుమెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలకు పరిమితమైన నిర్మాణ దారులు రాబోయే రోజుల్లో హోం కమ్ ఆఫీస్ తరహా నిర్మాణాలను తెరమీదకు తెచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అపార్టుమెంట్లలో ఉద్యోగుల కోసం డీలక్స్, సూపర్ డీలక్స్ ప్లాట్లు, కామన్ వర్క్ స్పేస్ ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం రాబోయే రోజుల్లో ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నిర్మించే బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ప్రహరీ నిర్మించాకే గృహ నిర్మాణం చేపట్టాలా?
‘గృహవాస్తు ప్రకారం.. ప్రహరీ నిర్మించుకున్నాకే గృహనిర్మాణం చేపట్టాలి. అలా చేయటం వల్ల మీరు నిర్మిస్తున్న ఇంటిపై పరిసరాల ప్రభావం పడదు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా నిర్మాణ పనులను పూర్తిచేయటానికి ఆస్కారం ఉంటుంది. ముందే ఇంటిని నిర్మించి చివరలో ప్రహరీని కట్టిస్తే వివిధ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. అలా కాకపోయినా కనీసం దక్షిణ, పడమరల వైపైనా ముందుగా ప్రహరీ నిర్మించుకోవాలి. రోడ్డు ఉన్న వైపు గేటును ఏర్పాటు చేసుకోవాలి. ప్రహరీ ఎత్తు అయిదున్నర నుంచి ఆరు అడుగుల ఎత్తు ఉండాలి’’ - జీవీ వరప్రసాద్, వాస్తు నిపుణులు
మరిన్ని ఆసక్తికర విషయాలు వీడియోలో చూడండి..
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
