
తాజా వార్తలు
పీఎంఓ పేరుతో ఈ-మెయిల్స్.. వైద్యుడి అరెస్టు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) పేరుతో ఈ- మెయిల్స్ పంపిన ఓ వైద్యుడిని అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లో నివాసముండే విజయ్ పరీఖ్ అనే వైద్యుడు స్థానికంగా ఉండే పరిమళ్ గార్డెన్ ప్రాంతంలోని రెండు కార్యాలయాలను నితీశ్షా అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. అయితే కొన్ని రోజులు తర్వాత నితీశ్ ఆ కార్యాలయాలను వైద్యుడికి అప్పగించడానికి నిరాకరించాడు. దీంతో సదరు వైద్యుడు తన సమస్య త్వరగా పరిష్కారమవ్వాలని ఓ ఆలోచన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మెయిల్స్ వస్తే అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి తనకు తక్షణ న్యాయం చేస్తారని భావించాడు. ఈ క్రమంలో పీఎంఓ కార్యాలయం అధికారుల పేరుతో గుజరాత్ ఉన్నతాధికారులతో పాటు ఐపీఎస్ అధికారులకు తన సమస్యను వివరిస్తూ ఇటీవల మెయిల్స్ చేశాడు.
వైద్యుడు విజయ్ రెండు కార్యాలయాలను ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు.. ఆ వ్యక్తి వాటిని తన పేరిట మార్చడం లేదని అందుకు వైద్యుడు పీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించినట్లు.. రాష్ట్ర అధికారులు దీనిపై స్పందించాలని.. ఈ ఘటనకు సంబంధించి పీఎంఓ అధికారులు పర్యవేక్షిస్తున్నారని మెయిల్స్‌లో ఉంది. ఆ ఈ-మెయిల్ ఐడీలను పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులు వాటిని పరీఖ్ అనే వైద్యుడు పంపినట్లు గుర్తించారు. తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం పీఎంఓ అధికారుల పేరును వాడుకున్న వైద్యుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
