close

తాజా వార్తలు

Updated : 07/10/2020 21:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేదార్‌ జాదవ్‌ ఓ డెకరేషన్‌ పీస్‌: వీరూ

కేదార్‌ జాదవ్‌పై తనదైన శైలీలో సెహ్వాగ్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ధోనీ శాపగ్రస్థుడని.. మోర్గాన్‌ జాన్‌ స్నో అని.. తాహీర్‌ మారథాన్‌ మ్యాన్‌ అని.. పోల్చి నేడు జరగనున్న కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌ను విశ్లేషించాడు. ‘వీరూకి బైటక్‌’(వీరూతో సమావేశం) 19వ ఎపిసోడ్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సెహ్వాగ్‌ మాటల్లోనూ చదివేయండి.. 

పోరులో ఉసెన్‌బోల్ట్‌లా చెన్నై 
కోల్‌కతా, చెన్నైకి మధ్య పోటీలో 13 విజయాలతో ధోనీసేన ‘ఉసెన్ బోల్ట్‌’లా దూసుకెళుతోంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌ బౌలర్లను చెన్నై బ్యాట్స్‌మెన్‌ ‘ట్యూన్‌’ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే పంజాబ్‌ బౌలర్లు చెన్నై ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. కానీ, కోల్‌కతా ‘బౌలర్ల యూనియన్‌ డిమాండ్ల’ను చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తారన్నది చూడాలి. అబుదాబి మైదానంలో ఈ పోరు ఆసక్తిగా మారనుంది. ఎంఎస్‌ ధోనీ ఈ మ్యాచ్‌లోనైనా తన ‘శాపం’ నుంచి విముక్తి పొందుతాడో లేదో చూడాలి. అది మరింత ఆసక్తికరం. 
చెన్నై ఎదుర్కొంటున్న మరో సమస్య.. డుప్లెసిస్‌కు ‘తోడు’ లేకపోవడం. పాపం ఫాఫ్‌ ఒక్కడే ‘గుర్రపు బండి’ని నడిపిస్తున్నాడు. కేదార్‌ జాదవ్‌ గురించి చెప్పాలంటే. అతని ఆటతీరు ‘గోధుమ పిండిలో ఒకరవ్వ’లా ఉంది. బ్యాటింగ్‌ చేయడు.. ఫీల్డింగ్‌ అంతకన్నా చేయడు. ధోనీ కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. రూ.8కోట్లు పెట్టి కేదార్‌ను కొన్నది ‘డెకరేషన్‌ పీస్‌’ కోసమేనా..? చెన్నై బౌలింగ్‌ ట్రాక్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. బ్రావో మాత్రం కొద్దిగా ట్రాక్‌ తప్పినట్లున్నాడు. నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో మారథాన్‌ మ్యాన్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ ఆడే అవకాశాలున్నాయి. కోల్‌కతాపై అతనికి మంచి రికార్డు ఉంది. అబుదాబిలో స్పిన్‌ కీలక పాత్ర పోషిస్తుందేమో ఎవరికి తెలుసు..?

రసెల్‌ కండలకు పని చెప్పాలి
కోల్‌కతా బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మోర్గాన్‌ ఫైల్‌(ప్రతిభ) కోల్‌కతా ప్రణాళికల్లోనూ చిక్కుకుపోతోంది. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేయగలడు. అతడ్ని గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లో జాన్‌ స్నో(స్వార్థం లేని సహజమైన నాయకుడు)లా చూస్తున్నారు. ఇకపోతే కండలవీరుడు రసెల్ గురించి చెప్పాలి. అతను తన కండలకు ఇంకెప్పుడు పనిచెప్తాడో..? టోర్నీ ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు పూర్తయ్యాయి. 
సునీల్‌ నరైన్ బౌలింగ్‌ వేసే సమయంలో ‘మంత్రాలు జపించాలి’. నరైన్‌ బౌలింగ్‌లో వాట్సన్‌ 4 సార్లు పెవిలియన్‌ చేరాడు. కాబట్టి ఈ ఓపెనర్‌ జాగ్రత్తగా నడుచుకోవాలి. రెండు వారాల తర్వాత స్టార్ట్‌ అయిన ‘డీజిల్‌ ఇంజిన్‌ చౌక్‌’ని నరైన్‌ ఆఫ్‌ చేస్తే చెన్నై పరిస్థితి ఏంటి..? ప్యాట్‌ కమిన్స్‌తో పాటు నరైన్‌ కూడా కోల్‌కతాకు ‘బంగారు బాతు’ అవుతాడు. వీళ్లిద్దరినీ డీకే(దినేశ్‌ కార్తీక్‌) సరిగ్గా వాడుకొని వాట్సన్‌, డుప్లెసిస్‌ను ఔట్‌ చేస్తే మ్యాచ్‌ను త్వరగా ముగించవచ్చు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.