నిర్భయ దోషుల ఇంటర్వ్యూ కోసం ప్రయత్నాలు
close

తాజా వార్తలు

Published : 11/03/2020 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్భయ దోషుల ఇంటర్వ్యూ కోసం ప్రయత్నాలు

దిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో త్వరలో ఉరికంభం ఎక్కబోతున్న నలుగురు దోషులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో దోషులైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌లను ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి కల్పించాలంటూ ఓ మీడియా సంస్థ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. మీడియా సంస్థ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని తిహాడ్‌ జైలు అధికారులను అడిగింది. దీనిపై రేపటి(గురువారం)లోగా తమ నిర్ణయం తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. 

పలు వాయిదాల అనంతరం నిర్భయ దోషులను ఈ నెల 20 ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇటీవల కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. న్యాయపరమైన అవకాశాల పేరుతో చివరి నిమిషంలో దోషులు కొత్త పిటిషన్లు, క్షమాభిక్షకు దరఖాస్తులు పెట్టుకోవడంతో ఇప్పటికే మూడు సార్లు ఉరితీత వాయిదా పడింది. అయితే ప్రస్తుతం దోషులకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో మార్చి 20న వీరిని ఉరితీయడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. 

అయినప్పటికీ ఉరి అమలు వాయిదా కోసం దోషులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని