
తాజా వార్తలు
అర్ణబ్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురు
ముంబయి: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టయిన అర్ణబ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో అర్ణబ్‌తో పాటు మరో ఇద్దరిని అలీబాగ్ పోలీసులు నవంబర్ 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమ అరెస్టు అక్రమమని పేర్కొంటూ అర్ణబ్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా శుక్రవారం ఆయనకు బెయిల్ లభించలేదు. మధ్యంతర బెయిల్‌పై శనివారం వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది. తాజాగా విచారించిన బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, బెయిల్ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును కల్పించడంతో ఆయన అలీబాగ్‌లోని సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం లోపు విచారణ జరపాలని బాంబే హైకోర్టు సెషన్స్ కోర్టును ఆదేశించింది. అర్ణబ్‌ను తొలుత జైలు క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అర్ణబ్ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు సమాచారం రావడంతో ఆదివారం ఆయన్ను తలోజా జైలుకు తరలించారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
