అతడు రెండేళ్లు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలి
close

తాజా వార్తలు

Published : 06/11/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతడు రెండేళ్లు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలి

బెయిల్‌ ఇస్తూ వ్యక్తికి అలహాబాద్ హైకోర్టు షరతు

లఖ్‌నవూ: సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖులపై అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు రెండేళ్లు సోషల్‌ మీడియాను వినియోగించద్దనే షరతుతో ఓ వ్యక్తికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అఖిలానంద్‌ అనే వ్యక్తి అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలలుగా జైల్లో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న సదరు వ్యక్తి బెయిల్‌ కోసం ఇటీవల అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాడు. నిందితుని తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ సిద్ధార్థ్‌ అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. నిందితుడు రెండేళ్ల పాటు లేదా ట్రయల్‌ కోర్టులో తీర్పు వెలువడేవరకు సామాజిక మాధ్యమాలను వినియోగించకూడదని ఆదేశించారు. యూపీ సీఎంతో పాటు పలువురు ప్రముఖులపై ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లో అభ్యంతర పోస్టులు పెట్టాడనే ఆరోపణలతో అఖిలానంద్‌ను ఆ రాష్ర్ట పోలీసులు మే 12న అరెస్టు చేశారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని