హ్యాపీ బర్త్‌డే నాగార్జున: సెలబ్రిటీస్‌ విషెస్‌
close

తాజా వార్తలు

Updated : 29/08/2020 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్యాపీ బర్త్‌డే నాగార్జున: సెలబ్రిటీస్‌ విషెస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: శనివారం అగ్ర కథానాయకుడు నాగార్జున 61వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులతో పాటు, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తనయులు నాగచైతన్య, అఖిల్‌, కోడలు సమంత, మహేశ్‌బాబు, వెంకటేశ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌, మంచు మనోజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లావణ్య త్రిపాఠి, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌, అనూప్‌ రూబెన్స్‌ ఇలా పలువురు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘హ్యాపీయెస్ట్‌ బర్త్‌డే నాగార్జున. మీరెప్పుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా. స్టే సేఫ్‌’’ -మహేశ్‌బాబు

‘‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు ఆయన. నా వెన్నంటే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్న ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీబర్త్‌డే కింగ్‌ నాగార్జున’’ -సమంత

‘‘ఈ ఫొటో మా మధ్య ఉన్న బంధాన్ని బహు రూపాల్లో చూపిస్తుంది. నా పరుగుకు కళ్లెం వేస్తూ, నా జీవితంలో నాతోనే నడుస్తున్నారు. ఆయన ఫిట్‌నెస్‌, ఆలోచన విధానం, అన్నీకొత్తగా ఉంటాయి. మీరొక గొప్ప మనిషి. హ్యాపీ బర్త్‌డే మై డియరెస్ట్‌ ఫాదర్‌’’ -అఖిల్‌

‘‘అందమైన, ఛార్మింగ్‌ కలిగిన నాగార్జున సర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. కెరీర్‌ తొలినాళ్లలోనే మీతో తెర పంచుకునే అదృష్టం నాకు దక్కింది’’ -లావణ్య త్రిపాఠి

‘‘మ మ మాస్‌స్‌.. మన అందగాడు కింగ్‌ నాగార్జున సర్‌కి హ్యాపీయెస్ట్‌ మ్యూజికల్‌ బర్త్‌డే టు’’ -దేవిశ్రీ ప్రసాద్‌

‘‘హ్యాపీ బర్త్‌డే నాగ్‌. ఈ ఏడాది నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి’’ -విక్టరీ వెంకటేశ్‌

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని