హర్భజన్‌ తొలి చిత్రం.. ఫస్ట్‌లుక్‌ వైరల్‌
close

తాజా వార్తలు

Published : 05/06/2020 22:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హర్భజన్‌ తొలి చిత్రం.. ఫస్ట్‌లుక్‌ వైరల్‌

ట్విటర్‌ ట్రెండింగ్‌లో..

చెన్నై: టీమ్‌ ఇండియా సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మాజీ బౌలర్‌‌ హర్భజన్‌ సింగ్.  క్రీడాకారుడిగా మైదానంలో సత్తా చాటిన ఆయన ఇప్పుడు వెండితెరపై కూడా అదరగొట్టడానికి సిద్ధమౌతున్నారు. తమిళ సినిమా ‘ఫ్రెండ్‌షిప్‌’తో నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని అలరిస్తోంది. హర్భజన్‌ తొలి చిత్రం కావడంతో ఫస్ట్‌లుక్‌ వైరల్‌గా మారింది. ఇండియా ట్విటర్‌ ట్రెండ్స్‌లో 4వ స్థానంలో ఉంది.

ప్రముఖ నటుడు అర్జున్‌ ‘ఫ్రెండ్‌ షిప్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యాం సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో తెలిపారు. కళాశాల, చదువు, క్రీడల నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా విడుల కాబోతోంది. శ్రీలంకకు చెందిన యాంకర్‌ లాస్లియా ఈ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం కాబోతుండటం మరో విశేషం. ఆమె విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బిస్‌’ తమిళ సీజన్‌లోనూ పాల్గొన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని