close

తాజా వార్తలు

Published : 20/08/2020 15:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలస్యంగానే భజ్జీ!

జట్టుతో దుబాయ్‌ వెళ్లలేకపోతున్న వెటరన్‌ స్పిన్నర్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ శుక్రవారం దుబాయ్‌ వెళ్లడం లేదని సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల జట్టు సభ్యులతో కలిసి అతడు ప్రయాణం చేయడం లేదు. పది రోజులు ఆలస్యంగా అతడు దుబాయ్‌కు చేరుకొనే అవకాశం ఉందని తెలిసింది. అతడితో పాటు మరో నలుగురు ఆటగాళ్లూ ఆలస్యంగానే జట్టుతో కలవనున్నారు.

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌-2020 ఆరంభం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతి జట్టు బయో బుడగను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు వెళ్తున్నాయి. అందరికన్నా ముందుగా చెన్నై జట్టు అక్కడికి వెళ్తోంది. నెల రోజుల పాటు సాధన చేస్తే అక్కడి వాతావరణం, పిచ్‌లపై అవగాహన వస్తుందని ఫ్రాంచైజీ ఆలోచన. ఇప్పటికే ఎంఎస్‌ ధోనీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు సహా అందరూ చెపాక్‌ శిబిరంలో ఉన్నారు.

వ్యక్తిగత కారణాలతో భజ్జీ చెపాక్‌ శిబిరానికి సైతం రాలేదు. అతడితో పాటు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా హాజరవ్వలేదు. అయితే శుక్రవారం అతడు జట్టుతో కలిసి దుబాయ్‌ వెళ్లనున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్‌, లుంగి ఎంగిడి సెప్టెంబర్‌ ఆరంభంలో జట్టుతో కలుస్తారు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతున్న ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ శాంట్నర్‌, డ్వేన్‌ బ్రావో రాక ఆలస్యం కానుంది. భజ్జీ, జడ్డూ, తాహిర్‌, శాంట్నర్‌, కర్ణ్‌శర్మ, పియూష్‌ చావ్లాతో కూడిన సీఎస్కే స్పిన్‌ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని