close

తాజా వార్తలు

Published : 29/10/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎవరికి ఓటెయ్యాలో ప్రజలే ఆలోచించాలి: హరీశ్‌

సిద్దిపేట: తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు దుబ్బాక ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పోలింగ్‌ గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బుధవారం దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మంగళ హారతులు, బతుకమ్మ, బోనాలతో గ్రామస్థులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, భాజపాలపై హరీశ్‌ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

‘‘కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు.. భాజపా అంటే బాయిల కాడ మీటర్లు. రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాల నుంచి రైతులకు నాణ్యమైన 24గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. దేశంలో భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంటు, రైతులకు పెట్టుబడి సాయం, రైతు బీమా ఇస్తున్నారా? దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడిగా రెండు పంట కాలాల్లో కలిపి రూ.10వేలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇవన్నీ గమనిస్తూ.. ప్రజలంతా ఆలోచించి తమ ఓటును వేయాలి. ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్‌, భాజాపా నేతలు మళ్లీ ఇటువైపు వస్తారా? కనబడతారా? మన ఇంట్లో వాళ్లు ఎవరో.. బయటి వాళ్లు ఎవరో గమనించాలి’’ అని హరీశ్ రావు అన్నారు.Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని