గోడలపై బ్లాక్‌బోర్డులు.. మైక్‌లో పాఠాలు 
close

తాజా వార్తలు

Published : 07/10/2020 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోడలపై బ్లాక్‌బోర్డులు.. మైక్‌లో పాఠాలు 

 ప్రశంసించిన ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయంకా

రాంచి: ఒక్కోసారి మనకు ఎదురైన సమస్యలే వినూత్న ఆలోచనలకు ప్రాణం పోస్తాయి. అయితే, కరోనా వైరస్‌ తెచ్చిన ఎన్నో సమస్యల్లో విద్యార్థులను బడికి దూరం చేయడం కూడా ఒకటి. ప్రైవేటు విద్యాసంస్థలు చాలా వరకు ఆన్‌లైన్‌ తరగతులకే మొగ్గుచూపుతుంటే..సౌకర్యాలలేమిని ఎదుర్కొనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులకు చదువు దూరం కాకూడదని భావించిన ఝార్ఖండ్‌లోని దుమర్తార్‌ గ్రామానికి చెందిన అధ్యాపకులు కొత్త ప్రయత్నం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఒకేసారి 200 మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకునే ఏర్పాటు చేశారు. ఆ ఊర్లోని ఇళ్లగోడలపై ఎవరి బ్లాక్‌బోర్డు వారికి ఏర్పాటు చేయగా, ఉపాధ్యాయులు మైక్‌లో పాఠాలు చెప్తుంటే, విద్యార్థులు అరుగులపై కూర్చొని ఆలకిస్తూ, రాసుకోవడం కనిపిస్తుంది. 

కాగా, ఈ ఆలోచనకు సంబంధించిన దృశ్యాలు ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయంకా దృష్టికి వచ్చాయి. వెంటనే ఆయన వాటిని ట్విటర్‌లో షేర్ చేస్తూ..‘ఝార్ఖండ్‌లోని ఓ గ్రామంలో భౌతిక దూరం నియమాలను పాటిస్తూ గోడలపై బ్లాక్‌బోర్డులను ఏర్పాటుచేయగా, ఉపాధ్యాయులు మైక్‌లో పాఠాలు చెప్తుంటే విద్యార్థులు శ్రద్ధగా రాసుకుంటున్నారు. ఈ ప్రత్యేక తరగతిలో 200 మంది విద్యార్థులు ఒకేసారి పాఠాలు వింటున్నారు. అద్భుతమైన ఆలోచన!’ అంటూ ప్రశంసించారు. నెటిజన్లు కూడా ఈ ఆలోచనను అద్భుతం అంటూ పొగిడేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని