ఒకే చిత్రంలో కరోనా వర్తమానం, భవిష్యత్తు! 

తాజా వార్తలు

Published : 28/12/2020 01:08 IST

ఒకే చిత్రంలో కరోనా వర్తమానం, భవిష్యత్తు! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సంవత్సరం ప్రపంచానికే పీడకలగా మారిన కరోనా వైరస్‌ మహమ్మారిని అందించినా.. వివిధ కట్టడి చర్యలు, వ్యాక్సిన్ల విడుదలతో కొత్త సంవత్సరం అనుకూలంగానే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. కాగా, ఇందుకు చిత్ర రూపం అనదగ్గ ఓ ట్వీట్‌ను ఆర్పీజీ గ్రూపు చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈయన సంస్థల నికర విలువ నాలుగు బిలియన్‌ డాలర్లకు చేరేందుకు పరుగులు తీస్తోంది. ఈ భారతీయ వ్యాపార దిగ్గజం, అభిరుచి గల కళా పోషకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకోవటం విశేషం. కాగా ప్రస్తుత, నూతన సంవత్సరాలను గురించి ఆయన చేసిన ట్వీట్‌.. ఆసక్తికరంగానే కాకుండా ఆశాజనకంగా కూడా ఉంది. నెటిజన్లతో పాటు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ దానిలో ఏముందంటే..

ప్రస్తుత సంవత్సరం 2020 అంకెలో చివర ‘0’ స్థానంలో ఉన్న కరోనా వైరస్‌ను.. రానున్న 2021 చివరలో ‘1’ స్థానంలో ఉన్న టీకా సూది నయం చేస్తుందనే సందేశం దీనిలో ఇమిడి ఉంది. సింపుల్‌గా ఉన్న ఈ ఒకే ఒక్క చిత్రంతో.. భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించినందుకు హర్ష్‌ గోయెంకాను పలువురు అభినందించారు. ఆయనది అద్భుతమైన, సృజనాత్మక ఆలోచనా ధోరణి అంటూ ప్రశంసించారు. ఈ వ్యాపారవేత్త ఆలోచన నిజం కావాలంటూ గొంతుకలిపారు.

ఇవీ చదవండి..

వినేద్దామా పుస్తకాలను!

బ్రిటన్‌ రాణికున్న అధికారాలివే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని