ప్రధాని ఫొటోనే వాడేసుకున్నాడు!
close

తాజా వార్తలు

Published : 31/12/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రధాని ఫొటోనే వాడేసుకున్నాడు!

లఖ్‌నవూ: వారణాసిలోని ప్రధాని మోదీ కార్యాలయాన్ని కొందరు దుండగులు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన సంఘటన ఇంకా కనుమరుగు కాక ముందే.. అటువంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి వ్యాపార ప్రచారం కోసం ఏకంగా ప్రధాని, ముఖ్యమంత్రుల చిత్రాలను వాడుకున్న ఓ వ్యక్తిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. కాగా, ఇతను ఓ ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి సోదరుడు కావటం గమనార్హం. నిందితుడు లలిత్‌ అగర్వాల్‌ సోదరుడు కపిల్‌ దేవ్‌ అగర్వాల్‌ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా మంత్రిగా ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..

లలిత్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి ఓ యాడ్‌ ఏజన్సీ నడుపుతూ ఉంటాడు. ఓ మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఏజెన్సీ డిసెంబర్‌ 22న ఓ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల ఫొటోలను ముద్రించారు. ఈ అంశంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సదరు యాడ్‌ ఏజన్సీ డిసెంబర్‌ 26న దానిని తొలగించింది. ఈ చర్యకు గాను క్షమాపణ కోరింది. అయతే ఈ సంఘటనపై అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు.

‘‘స్థానిక ఉత్పత్తులకే పెద్దపీట వేయాలనే ప్రభుత్వ పథకం ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ ముసుగులో.. రాష్ట్ర మంత్రి మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సదరు ఫోన్‌ పూర్తి స్వదేశీ తయారీ అని, కుశల్‌ వికాశ్‌ యోజన కార్యక్రమంలో భాగమని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లో అవినీతి శిఖరాలను తాకుతోందనేందుకు ఉదాహరణ.’’ అని ఆ  రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ లల్లూ ఆరోపించారు. ఈ సంఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఆయన  డిమాండ్‌ చేశారు.
ఈ విషయమై మంత్రి కపిల్‌ అగర్వాల్‌ స్పందిస్తూ..కొందరు రాజకీయ కారణాలతో తన సోదరుణ్ని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ఈ కేసులో పసలేదని.. తన సోదరుడు త్వరలోనే నిర్దోషిగా విడుదలౌతారని మంత్రి కపిల్‌ అగర్వాల్‌ అన్నారు.

ఇవీ చదవండి..

ప్రాణం తీసిన భోజనాల గొడవ

గుండెపోటుతో ఒకేసారి అన్నదమ్ముల మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని