పొగాకు వినియోగ వయోపరిమితి పెంపు!
close

తాజా వార్తలు

Published : 24/02/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొగాకు వినియోగ వయోపరిమితి పెంపు!

దిల్లీ: ధూమపానం వంటి పొగాకు ఉత్పత్తులను వినియోగానికి ఉన్న కనీస వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కేంద్రం పెంచనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని (సీఓటీపీఏ) మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నియమించిన సభ్యుల బృందం ఈ మేరకు సీఓటీపీఏ సవరణలకు సంబంధించి పలు సూచనలు చేసింది. దాంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను సరఫరా చేసేవారికి విధించే జరిమానా మొత్తాన్ని కూడా పెంచాలని సూచించినట్లు సమాచారం.

‘‘ఎక్కువ శాతం మంది పాఠశాల, కళాశాల స్థాయిలోనే పొగతాగేందుకు అలవాటు పడుతున్నారు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు వారు ఒత్తిడి, ఫ్యాషన్‌ సింబల్‌గా ధూమపానాన్ని భావించడం వల్ల తయారీ సంస్థలు ఎక్కువగా ఆ వయస్సు వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చట్టపరంగా ధూమపానం చేసే వారి వయస్సు 21 సంవత్సరాలకు పెంచడం వల్ల ఏటా కొంత మంది యువతను ఆ వ్యసనానికి అలవాటు పడకుండా అడ్డుకోవచ్చు. అంతేకాకుండా పెద్దవారు 21 ఏళ్ల వయస్సులోపు వారిని కూడా పొగాకు ఉత్పత్తులు కొనేందుకు పంపరు’’ అని బృందంలోని అధికారి వెల్లడించారు.

దీంతో పాటు పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈ బృందం పలు సూచనలు చేసింది. ఇందుకోసం పొగాకు ఉత్పత్తలు తయారీదారులు వాటిపై బార్‌ కోడ్‌ను ముద్రించాలి. దాని ఆధారంగా అధికారులు తనిఖీల సమయంలో వాటికి పన్నులు చెల్లించి రవాణా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ధ్రువీకరిస్తారని తెలిపారు. నిషేధిత ప్రాంతాల్లో పొగ తాగే వారికి విధించే జరిమానాను కూడా ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి ఎక్కువ మొత్తానికి పెంచాలని సూచించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని