నెల్లూరులో కుండపోత..కాలనీలు జలమయం
close

తాజా వార్తలు

Published : 12/11/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరులో కుండపోత..కాలనీలు జలమయం

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లూరు నగరం చుట్టూ ఉన్న కాలనీలన్నీ ముంపునకు గురయ్యాయి. ఆర్టీసీ కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీ, చంద్రబాబు కాలనీ, మాగుంట లే అవుట్‌, ఎన్టీఆర్‌ నగర్ కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవీంద్రనగర్‌, బుచ్చిరెడ్డిపాలెంలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని