
తాజా వార్తలు
తిరుమలలో వర్ష బీభత్సం
తిరుమల: నివర్ తుపాను ప్రభావానికి తిరుమలలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం మొదలైన వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. తిరుమలకు వస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు దారికి అడ్డంగా పడిన చెట్లను తొలగించి స్తంభించిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. తుపాను కారణంగా తిరుపతికి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు ప్రయాణికులకు విమానయాన సంస్థలు సందేశాలు పంపాయి. తుపాను దృష్ట్యా చిత్తూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రాంతాల్లో్ ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో పుల్లూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పుల్లురు క్రాస్ నుంచి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో కపిలతీర్థం జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
భారీ వర్షాలతో తిరుపతిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. కపిలతీర్థంలో కాలువను ఆనుకొని ఉన్న పలుకాలనీల్లోకి వరద నీరు చేరింది. తిరుపతి అర్బన్ శ్రీనివాసం 11కెవీ ఉపకేంద్రం పరిధిలో రాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. కమలాపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి నీరు చేరిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రేణిగుంట- కడప జాతీయ రహదారిలో కడప జిల్లా సరిహద్దులో రోడ్లు దెబ్బతిన్నాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
