close

తాజా వార్తలు

Published : 04/08/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వర్షం ధాటికి వణికిన ముంబయి!

10గంటల్లోనే 23సెం.మీ వర్షపాతం నమోదు
రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన అధికారులు

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీవర్షాల ధాటికి మహా నగరంలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ ఏకధాటిగా వర్షం కురిసింది. కేవలం పదిగంటల నిడివిలోనే దాదాపు 230మి.మీ వర్షపాతం నమోదైనట్లు బృహన్‌ ముంబయి నగరపాలక సంస్థ వెల్లడించింది. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నగరంలోని పలుప్రాంతాల్లో వరదలను తలపిస్తున్నాయి. సముద్రతీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా అత్యవసరసేవలు మినహా అన్ని వాణిజ్య కార్యాలయాలు మూతపడ్డాయి. నగరంలో చాలా ప్రాంతాలకు బస్సులు, లోకల్‌ రైలు సర్వీసులను నిలిపివేశారు. థానే జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది.

మరో రెండురోజులపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలో మరో రెండు రోజులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతేతప్ప బయటకు రావొద్దని సూచించారు. ముందు జాగ్రత్తగా ముంబయిలో నేడు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని మహారాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆధిత్య ఠాక్రే సూచించారు. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.