close

తాజా వార్తలు

Published : 16/09/2020 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్‌ఆర్‌ఎస్పీ 26 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌: శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 96,013 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి 75వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అయితే, బుధవారం తెల్లవారుజామున 40గేట్లను ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఉదయం 11 గంటలకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో 14గేట్లను మూసివేసి 26గేట్ల ద్వారా నీటిని గోదవరిలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. 

సదర్మత్‌ కాలువ ద్వారా ఎనిమిది వేలు, కాకతీయ కాలువ ద్వారా వెయ్యి, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మీ కాలువ ద్వారా 300, వరద కాలువ ద్వారా 10,371క్యూసెక్కుల చొప్పును నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో 1,091అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద తీవ్రతను బట్టి  నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని