close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 05/05/2020 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాను అడ్డుకుంటున్న హెపటైటిస్‌-సి ఔషధం!

బెర్లిన్‌: హెపటైటిస్‌-సి చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కొవిడ్‌-19ను సమర్థంగా అడ్డుకోగలవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సూపర్‌ కంప్యూటర్‌ సిమ్యూలేషన్‌లో విస్తృత గణనలను ఉపయోగించి దీనిని నిర్వహించారు. జర్మనీలోని జొహనెస్‌ గుటెన్‌బర్గ్‌ యూనివర్సిటీ మైంజ్‌ (జేజీయూ) పరిశోధకులు సార్స్‌-కొవిడ్‌2 ప్రొటీన్లను బంధించే 42,000 పదార్థాలను సిమ్యూలేట్‌ చేశారు.

అత్యంత శక్తిమంతమైన మోగాన్‌ 2 సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగించి ఆ పదార్థాలు కరోనా పునరుత్పత్తిని అడ్డుకుంటున్నాయో లేదో పరీక్షించారు. ఇందుకోసం రెండు నెలల్లోనే ఏకబిగిన 3000 కోట్ల గణనలు చేపట్టారు. హెపటైటిస్‌-సికి ఉపయోగించే సిమిప్రివిర్‌(simeprevir), పరిటప్రివిర్‌ (paritaprevir), గ్రజోప్రివిర్‌  (grazoprevir), వెల్పటస్విర్‌ (velpatasvir) ఔషధాలు కొవిడ్‌-19ను అడ్డుకునేలా కనిపిస్తున్నాయని వెల్లడించారు.

‘సార్స్‌-కొవ్‌2తో మాలిక్యులర్‌ డాకింగ్‌ను మొదట ఉపయోగించింది మేమే. కొవిడ్-19 చికిత్సకు హెపటైటిస్‌-సి ఔషధాలు సమర్థంగా పనిచేసే అవకాశముందని తెలియడం గొప్ప శుభవార్త. ఎందుకంటే కొవిడ్-19, హెపటైటిస్‌-సిలో ఉండే వైరస్‌ ఒకే జాతికి చెందింది. ఏక పోగు ఆర్‌ఎన్‌ఏ వైరస్సే’ అని ఫ్రొఫెసర్‌ థామస్‌ ఇఫెర్త్‌ అన్నారు.

జపాన్‌లో దొరికే సహజ మూలిక హనీసకిల్‌ (లోనిసెరా జపోనికా) సైతం కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగపడొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఆసియాలో వివిధ వ్యాధులకు చాలా ఏళ్లుగా దీనిని వాడుతున్నారు. శాస్త్రవేత్తలు క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టి తమ పరిశోధన ఫలితాలను తనిఖీ చేయాలని పరిశోధకులు కోరుతున్నారు. గతంలో మెర్స్‌-కొవ్‌, సార్స్‌-కొవ్‌కు మాక్యులర్‌ డాకింగ్‌ విజయవంతంగా ఉపయోగపడిందని వారు తెలిపారు.

జైడస్‌ క్యాడిలా విజ్ఞప్తి

కొవిడ్‌-19 చికిత్సకు హెపటైటిస్‌ బి, సి ఔషధాలతో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ)ని జైడస్‌ క్యాడిలా ఫార్మా కంపెనీ కోరింది. ‘పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్పా-2బి’ డ్రగ్‌తో ట్రయల్స్‌ నిర్వహిస్తామని అభ్యర్థించింది. చైనా ప్రభుత్వం కొవిడ్-19 చికిత్స మార్గదర్శకాల్లో ఈ డ్రగ్‌ను సూచించిందని వెల్లడించింది. అమెరికా, చైనా, క్యూబాలో చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇది అద్భుతంగా పనిచేసిందని పేర్కొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.