close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/06/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫేస్‌షీల్డ్‌ పెట్టుకుని హీరో రొమాన్స్‌!

ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను సబ్బు/శాటిటైజర్‌తో తరచూ శుభ్రం చేసుకోవడం. మరి వందలమంది పాల్గొనే సినిమా షూటింగ్‌లు, దర్శకులు తెరకెక్కించే సన్నివేశాల్లో భౌతిక దూరం సాధ్యమేనా? ముఖ్యంగా హీరో-హీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలుంటే? ఏం చేస్తారు? ఇదిగో ఈ ఫొటోలో మాదిరిగా ఫేస్‌షీల్డ్ పెట్టుకుని చేయాల్సి వచ్చేది.

ఆయుష్మాన్‌ఖురానా సోదరుడు అపర్‌శక్తి ఖురానా పంచుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. ఆయన కథానాయకుడిగా ‘హెల్మెట్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. అపర్‌శక్తి.. హీరోయిన్‌ ప్రనూతన్‌ కళ్లలోకి చూస్తూ హత్తుకునే ఓ సన్నివేశం ఈ సినిమాలో ఉంది. దానికి సంబంధించిన సీన్‌ను అపర్‌శక్తి పంచుకుంటూ.. లాక్‌డౌన్‌ ముందు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. లేకపోతే ఇదిగో ఇలా ఫేస్‌షీల్డ్‌ పెట్టుకుని నటించాల్సి వచ్చేదంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఇది నవ్వులు పూయిస్తోంది. మరి భవిష్యత్‌లో తెరకెక్కబోయే చిత్రాల్లో దర్శకులు రొమాంటిక్‌ సన్నివేశాలను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.