close

తాజా వార్తలు

Updated : 23/11/2020 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెట్‌ నుంచి వెళ్లిపోయిన శ్రుతిహాసన్‌..!

కారణమదే అంటోన్న కోలీవుడ్‌ వర్గాలు

చెన్నై: కమల్‌హాసన్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనప్పటికీ విభిన్నమైన నటనతో కథానాయికగా ప్రేక్షకులమదిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్రుతిహాసన్‌. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత వరుస సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాభం’ అనే తమిళ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు.

ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో చిత్రీకరణ జరిగే చోటుకి వచ్చారు. దీంతో శ్రుతిహాసన్‌.. షూటింగ్‌ మధ్యలోనే సెట్‌ నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా పరిస్థితుల కారణంగా సమూహాల్లో ఉండడం, తెలియని వాళ్లని కలవడం అంత  మంచిది కాదని శ్రుతి భావించారట.. దీంతో ఆమె షూటింగ్‌ మధ్యలోనే పేకప్‌ చెప్పేశారని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. గత కొన్నిరోజుల క్రితం  శ్రుతిహాసన్‌.. ‘కొవిడ్‌-19 వల్ల ప్రతిఒక్కరీ ఆరోగ్యానికి ప్రమాదం ఉంది!! అది ఇంకా అంతం కాలేదు. ప్రోటోకాల్స్‌ ఫాలో కాని తరుణంలో ఒక మహిళగా.. నటిగా జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది.!!’ అని ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని