కబ్జాదారులపై కేసులెందుకు పెట్టలేదు?: హైకోర్టు
close

తాజా వార్తలు

Published : 18/08/2020 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కబ్జాదారులపై కేసులెందుకు పెట్టలేదు?: హైకోర్టు

హైదరాబాద్‌: ముస్లిం శ్మశానవాటికల కబ్జాదారులపై కేసులు ఎందుకు పెట్టలేదని వక్ఫ్‌బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. కబ్జాలను వక్ఫ్‌బోర్డు చాలా సాధారణ అంశంగా చూస్తోందని వ్యాఖ్యానించింది. ముస్లిం శ్మశానవాటికల కబ్జాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. శ్మశాన వాటికల ఆక్రమణలపై వక్ఫ్‌బోర్డు నివేదిక సమర్పించింది. ఆస్తుల పరిరక్షణపై వక్ఫ్‌ బోర్డు అసమర్థత కనిపిస్తోందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ మైనార్టీల కోసం పని చేస్తున్నారా?అని ప్రశ్నించింది. దేవుడికి అంకితమిచ్చిన భూముల రక్షణలో బాధ్యతగా ఉండాలని చెప్పింది. సిబ్బంది కొరత వల్ల కొవిడ్‌ వేళ మరింత ఇబ్బందిగా ఉందని వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. సంబంధిత మంత్రికి చెబితే ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారు కదా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సర్వే నంబర్ల వారీగా కబ్జాల వివరాలతో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని