close

తాజా వార్తలు

Updated : 19/11/2020 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ప్రభుత్వానికి ప్రణాళిక లేదని భావించాలా?’

తెలంగాణ సర్కార్‌ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసులు, పరీక్షలపై ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. విచారణకు ముందు కేసులు పెంచి తర్వాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రోజుకు 50వేల కొవిడ్‌ పరీక్షలు చేయాలని.. ఆ సంఖ్యను లక్ష వరకు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా రెండో దశ ముప్పు పొంచి ఉందని.. ఇలాంటి సమయంలో భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని.. మార్గదర్శకాలు పాటించేలా ప్రజలను ఆదేశించాలని తెలిపింది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేసిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్‌పై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలు సమర్పించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి అసలు ప్రణాళిక లేదని భావించాలా? అని ప్రశ్నించింది. ఈ నెల 24లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన