చింగారీ యాప్‌: 3కోట్ల డౌన్‌లోడ్‌లు!
close

తాజా వార్తలు

Published : 21/09/2020 21:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చింగారీ యాప్‌: 3కోట్ల డౌన్‌లోడ్‌లు!

బెంగళూరు: టిక్‌టాక్‌ నిషేధంతో వెలుగులోకి వచ్చిన వీడియో షేరింగ్ యాప్‌ ‘చింగారీ’ భారీ ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ యాప్‌ 3కోట్ల సార్లు డౌన్‌లోడ్‌ అయినట్లు చింగారీ యాజమాన్యం ప్రకటించింది. కేవలం ఈ యాప్‌ను రూపొందించిన మూడు నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం గర్వకారణంగా ఉందని పేర్కొంది. ఈ యాప్‌ను వినియోగిస్తున్న వారిలో ఎక్కువగా 18-35 ఏళ్ల వయస్సువారేనని వెల్లడించింది. ఇంగ్లీష్‌, స్పానిష్‌తోపాటు హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళ్‌, ఒడియా, తెలుగు భాషల్లో ఈ యాప్‌ అందుబాటులో ఉందని తెలిపింది. భారత్‌తోపాటు యూఏఈ, అమెరికా, కువైట్‌, సింగపూర్‌, సౌదీ అరేబియా, వియాత్నం దేశాల్లోనూ యూజర్ల సంఖ్య పెరుగుతున్నట్లు చింగారీ సంస్థ ప్రకటించింది. టిక్‌టాక్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యాప్‌ను బెంగళూరుకు చెందిన ఆదిత్య కొఠారి రూపొందించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని