close

తాజా వార్తలు

Published : 18/06/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మన సైనికులను చంపేందుకు ఎంత ధైర్యం?

నిప్పులు చెరిగిన రాహుల్‌ గాంధీ

దిల్లీ: లద్ధాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న భారత-చైనా ఘర్షణల్లో 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చైనాపై మండిపడ్డారు. అంతేకాకుండా వాస్తవాధీన రేఖ వద్ద ఏం జరుగుతోందో తెలపాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘‘ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఏం దాస్తున్నారు? అయిందేదో అయింది... జరిగినదేంటో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మన సైనికుల ప్రాణాలు తీసి.. మన భూమిని కాజేయటానికి వారికి (చైనా) ఎంత ధైర్యం?’’ అని రాహుల్‌ ట్ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.

తూర్పు లద్దాఖ్‌ వద్ద చోటుచేసుకున్న ఈ హింసాత్మక ఘర్షణలో మరో 17 మంది భారత సైనికులు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా... చైనా వైపు కూడా మృతుల సంఖ్య 43గా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. తమ సైనికుల మృతదేహాలను తరలించేందుకు చైనా హెలికాప్టర్లు మోహరించిందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని