close

తాజా వార్తలు

ఐఫోన్‌తో ట్వీట్‌ చేశారని ఉద్యోగులపై చర్యలు

ఇద్దరికి హోదా తగ్గింపు, జీతంలో కోత

ఐఫోన్‌తో ట్వీట్‌ చేశారని ఉద్యోగులపై చర్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్‌ నుంచి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేసినందుకు హువావే సంస్థ తన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా హువావే అధికారిక ట్విటర్‌ ఖాతాలో శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యోగులు ఐఫోన్‌ నుంచి ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ‘ఫ్రం ఐఫోన్‌’ అని ఉండడంతో ఆ పోస్టు ఐఫోన్‌ నుంచే చేసినట్లు అర్థమవుతోంది. ఈ తప్పు చేసినందుకు గానూ ఆ సంస్థ సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు ఓ మెమో విడుదల చేసింది. తమ తప్పును తెలుసుకున్న ఉద్యోగులు వెంటనే ఈ పోస్టును తొలగించినా.. దానికి సంబంధించిన స్ర్కీన్‌ షాట్లు మాత్రం అంతర్జాలంలో వైరల్‌ అవుతున్నాయి. ఈ తప్పు వల్ల తమ బ్రాండ్‌కు నష్టం వాటిల్లనుందని సంస్థ ఉపాధ్యక్షుడు, డైరెక్టర్‌ చెన్‌ లిఫాంగ్‌ అన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది.

ఈ తప్పును మహాపరాధంగా పరిగణించిన హువావే సంస్థ.. జీతాలకు కోత విధిస్తూ, వారి హోదాను తగ్గించింది. దాదాపు 5 వేల యువాన్లు (728 డాలర్లు) మేర జీతంలో కోత విధించింది.

చైనాకు చెందిన మొబైల్‌ ఫోన్ల సంస్థ హువావే.. ఆపిల్‌ సంస్థను తన ప్రధాన పోటీదారుగా భావిస్తోంది. హువావేకు చెందిన పి-సిరీస్‌ ఫోన్‌.. ఐఫోన్‌ మధ్య పోటీ వాతావరణం నెలకొంది. తమ ఉద్యోగులు యాపిల్‌ ఉత్పత్తులు వాడుతుండడంపై హువావే సంస్థ గతంలో ఆంక్షలు విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఐఫోన్‌తో ట్వీట్‌ చేశారని ఉద్యోగులపై చర్యలు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.