మార్కెట్లోకి బీఎస్‌6 ఎలంట్రా డీజిల్‌
close

తాజా వార్తలు

Published : 24/06/2020 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి బీఎస్‌6 ఎలంట్రా డీజిల్‌

దిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ బీఎస్‌6 మోడల్‌ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెడాన్ విభాగంలోని ఎలంట్రా మోడల్‌లో రెండు డీజిల్‌ వేరియంట్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రారంభ మోడలైన ఎస్‌ఎక్స్‌(ఎంటీ) ధర రూ.18.70లక్షలు కాగా.. ఎస్‌ఎక్స్‌(ఓ) ఏటీ వేరియంట్‌ ధర రూ.20.65లక్షలుగా నిర్ణయించారు. వీటిల్లో పెట్రోల్‌ వేరియంట్‌ను గతేడాది అక్టోబర్‌లోనే మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్‌ వేరియంట్‌లో ఎస్‌ఎక్స్‌ ఎంటీ, ఎస్‌ఎక్స్‌ ఏటీ, ఎస్‌ఎక్స్‌ (ఓ)ఏటీ రకాలు ఉన్నాయి. వీటిధర రూ.17.60 లక్షల నుంచి రూ.19.55 లక్షల వరకు ఉంటోంది. 

డీజిల్‌ వేరియంట్ ఎలంట్రా అప్‌గ్రేడ్‌ చేసిన 1.5లీటర్‌ యూ2 సీఆర్‌డీఐ బీఎస్‌6 డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనిని ఇటీవల విడుదల చేసిన వెర్నా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ నుంచి తీసుకొన్నారు. ఈ ఇంజిన్‌ 4,000 ఆర్‌పీఎం వద్ద 113 బీహెచ్‌పీ శక్తిని1500 ఆర్‌పీఎం వద్ద  250ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక ఎస్‌ఎక్స్‌ ఎంటీలో సిక్స్‌స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌, ఎస్‌ఎక్స్‌ (ఓ) ఏటీలో సిక్స్‌స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చారు. 

ఇక కారు లుక్స్‌లో మాత్రం పెట్రోల్‌ వేరియంట్‌ను పోలిఉంది. ఫ్లూయిడిక్‌ 2.0 డిజైన్‌లో స్వల్పమార్పులు చేశారు. సరికొత్త కాస్కేడింగ్‌ గ్రిల్‌, సన్నటి ఎల్‌ఈడీ క్వాడ్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌, బంపర్‌, త్రికోణాకారంలో ఫాగ్‌ ల్యాంప్‌, 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, క్రోమ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, పాకెట్‌ లైట్‌ , క్యాబిన్‌లో డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌, సరికొత్త డాష్‌బోర్డ వంటి మార్పులు చోటు చేసుకొన్నాయి. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని