close

తాజా వార్తలు

Published : 23/05/2020 03:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏప్రిల్‌ నుంచి రూ.26,242 కోట్ల ఐటీ రిఫండ్‌ల జారీ

దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఏప్రిల్‌ నుంచి రూ.26,242 కోట్ల రిఫండ్‌లను జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి మే 21 మధ్య 16,84,298 మంది పన్ను చెల్లింపుదార్లు ఈ రిఫండ్‌ నగదు పొందారని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఇందులో ఆదాయపు పన్ను రిఫండ్‌ల కింద 15,81,906 మందికి రూ.14,632 కోట్లు జారీ చేశామని పేర్కొంది. 1,02,392 మంది కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదార్లకు రూ.11,610 కోట్ల రిఫండ్‌లు ఇచ్చామని వెల్లడించింది. ప్రజల వద్ద నగదు లభ్యత పెరిగేందుకు, కొవిడ్‌-19 సంక్షోభంతో పోరాడటానికి, కంపెనీలు తగినన్ని నిధులు కలిగి ఉండేందుకు రిఫండ్‌ల జారీ ప్రక్రియను ఐటీ విభాగం వేగిరం చేసిన సంగతి తెలిసిందే. గత వారం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేసినప్పటి నుంచి రిఫండ్‌ల జారీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. మే 16తో ముగిసిన వారంలో  రూ.2,050.61 కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్‌లను, రూ.867.62 కోట్ల కార్పొరేట్‌ పన్ను రిఫండ్‌లను ఐటీ విభాగం ప్రాసెస్‌ చేసింది. మే 17-21 తేదీల్లో ఆదాయపు పన్ను రిఫండ్‌ల కింద రూ.2,672.97 కోట్లు, కార్పొరేట్‌ పన్ను రిఫండ్‌ల కింద రూ.6,714.34 కోట్లను పన్ను చెల్లింపుదార్ల ఖాతాలో వేసింది. అంటే మొత్తంగా ఈ వారంలో రూ.9,387.31 కోట్ల రిఫండ్‌లను ఐటీ విభాగం జారీ చేసిందన్నమాట.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని