close

తాజా వార్తలు

Updated : 21/07/2020 20:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేతులెత్తి మొక్కుతున్నా ఆత్మహత్య చేసుకోవద్దు!

కొవిడ్‌ బాధితులకు సీఎం యడియూరప్ప విజ్ఞప్తి

బెంగళూరులో రేపట్నుంచి లాక్‌డౌన్‌ ఉండదు

బెంగళూరు: కరోనా మహా విజృంభణ నేపథ్యంలో కర్ణాటకలో మరోసారి విధించిన లాక్‌డౌన్‌ను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ రేపటి నుంచి లాక్‌డౌన్‌ ఉండదని సీఎం యడియూరప్ప ప్రకటించారు. ప్రజలు తిరిగి పనులకు వెళ్లాల్సిన అవసరం ఉందనీ.. ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో ముఖ్యమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటూనే కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ఇకపై కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రమే కొన్ని నిబంధనలు అమలు చేయనున్నట్టు యడియూరప్ప తెలిపారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. కరోనా బాధితులు ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ చేతులెత్తి వేడుకుంటున్నానన్నారు. కరోనా సోకిన వారిలో 98శాతం మంది కోలుకుంటున్నారని సీఎం తెలిపారు.

మీరైతే అసలు బయటకు రావొద్దు
చిన్నారులు, వృద్ధులు మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని యడియూరప్ప విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చిన వారితో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయన్నారు. 5T (ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌, టెక్నాలజీ వ్యూహంతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. మాస్క్‌లు ధరించని వారిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ప్రజల్లో మీడియా విశ్వాసం నింపడంతో పాటు ధైర్యాన్నివ్వాలని కోరారు. కొవిడ్‌పై పోరాటంలో మీడియా, ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.