close

తాజా వార్తలు

Published : 20/10/2020 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆమె పేరు గుర్తుకురాకే అలా అన్నాను’

‘ఐటం’ వ్యాఖ్యలపై కమల్‌నాథ్‌ వివరణ

దిల్లీ: ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని తెలిపారు. అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడంతో  ‘ఐటం’ అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు. ‘‘నేను ఓ మాట అన్నాను. అది ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో వాడలేదు. నాకు ఆ వ్యక్తి పేరు గుర్తుకురాలేదు. ఈ జాబితాలో (చేతిలో ఉన్న ఓ పత్రాన్ని చూపుతూ) ఐటం నెం.1, ఐటం నెం.2 అని ఉంది. అది అవమానించినట్లా?’’ అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేకే భాజపా ఈ అంశంపై వివాదం చేస్తోందని ఆరోపించారు. 

ప్రచార పర్వంలో భాగంగా గ్వాలియర్‌లోని డబ్రా పట్టణంలో కమల్‌నాథ్‌ ఆదివారం ప్రసంగిస్తూ.. ‘‘ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ రాజె నిరాడంబర వ్యక్తి. ఆయన ప్రత్యర్థి (భాజపా అభ్యర్థి) గురించి నా కంటే మీకే బాగా తెలుసు. తను ఓ ఐటం’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ రగడ రాజుకుంది. ఆయన తరఫున కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్‌ చేసింది. కమల్‌నాథ్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 

మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. డబ్రాలో కమలదళం తరఫున ఇమర్తీ దేవి బరిలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియాతోపాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు. వారి ఫిరాయింపుతో రాష్ట్రంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.