close
Array ( ) 1

తాజా వార్తలు

కాఫీ వివాదం: 10రోజులు కాలు బయటపెట్టలేదు

అహంభావిని కాదు.. ఆ కష్టం ఎవరికీ వద్దు: పాండ్య

ముంబయి: కొత్త ఏడాదిలో తొలి పది రోజులు హార్దిక్‌ పాండ్య జీవితంలో సంతోషంగా గడిచాయి. జనవరి 1న తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్‌కు నిశ్చితార్ధం ఉంగరం తొడిగాడు. వెన్నెముక గాయం నుంచి కోలుకొని భారత్‌-ఏ తరఫున న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నాడు. కానీ గతేడాది తొలి పది రోజుల్లో  అతడో వివాదంలో చిక్కుకున్నాడు. కాఫీ విత్‌ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సస్పెన్షన్‌ ఎదుర్కొన్నాడు. దాంతో ఇంట్లోంచి కాలు బయటకు పెట్టలేదని ఇండియా టుడే ‘ఇన్‌స్పిరేషన్‌’ కార్యక్రమంలో పాండ్య చెప్పాడు.


ఇంట్లోనే ఉండిపోయా

‘నాకిప్పటికీ గుర్తుంది. ఇంట్లోంచి కాలు బయట పెట్టలేదు. సమస్యను ఎదుర్కోనే తీరు ఇదికాదని వారం, పది రోజులకు గానీ అర్థం కాలేదు. అడుగు బయటపెట్టి విమర్శలను ఎదుర్కొన్నాను. ఇదో రకమైన పరీక్షగా భావించాను. జీవితంలో కఠిన దశలో ఇలాంటివి ఎదురవుతాయని గుర్తించాను. ఆపై నా దృష్టినంతా ఆటపైకి మళ్లించాను. జరిగింది మర్చిపోయాను. ఆర్నెల్లు సస్పెండ్‌ చేస్తారా? తర్వాత మ్యాచులోనే ఆడిస్తారా అని పట్టించుకోలేదు’ అని పాండ్య అన్నాడు.


అహంభావిని కాదు

‘చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. నా గురించి తెలియక నాకు అహంకారం అనుకుంటారు. నాతో మాట్లాడటం కష్టంగా భావిస్తారు. నాతో మాట్లాడాక నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నామని ఎందరో చెప్పారు. అందుకే నా గురించి తెలిసిన నా సహచరులతో నా సంబంధాలు ఎంతో సవ్యంగా ఉన్నాయి. వారంతా నిజంగా నా సోదరులు. జట్టులోకి తిరిగొచ్చాక అందరూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మానసికంగా, శారీరకంగా బాగున్నానో లేదో తెలుసుకోవడం ఒక మధుర స్మృతి’ అని పాండ్య తెలిపాడు.


ఈ కష్టం వద్దు

సంక్లిష్టమైన వెన్నెముక చికిత్స అనుభం ఎవరికీ ఎదురవ్వొద్దని పాండ్య అంటున్నాడు. ‘శస్త్రచికిత్స తర్వాత ఎలా ఉన్నానో అని విరాట్‌ సందేశం పంపించాడు. బాగున్నాను, కానీ ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి రాకూడదని బదులిచ్చాను. మందులు వేసుకోవడం, కోలుకోవడం సవాల్‌గా అనిపించింది. ఒక్క ఉదుటున 100 కిలోల బరువులెత్తే నేను కనీసం నా కాలు కదప లేకపోయాను. మన శరీరం సాధారణంగా 100% ప్రయత్నించేందుకు అలవాటై ఉంటుంది. ఒకసారి కత్తి మన దేహాన్ని తాకిన తర్వాత 200 % కష్టపడాలి. కోలుకోవడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడ్డాను’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి

రాహులోరాహులా.. మళ్లీ వస్తావా?

వాల్‌ కాదు.. అతడో కంచుకోట

6లో రాహుల్‌.. 9లో కోహ్లీ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.