close

తాజా వార్తలు

Published : 05/09/2020 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుటుంబంతో ఉండాలనే: భజ్జీ ప్రకటన

(BCCI Image)

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020లో తాను భాగమవ్వడం లేదని చెన్నై సూపర్‌కింగ్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కుటుంబంతోనే ఉండాలని భావిస్తున్నానని భజ్జీ అన్నాడు. తన నిర్ణయాన్ని చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యానికి తెలియజేశానన్నాడు. వారెంతో మద్దతుగా నిలిచారని వెల్లడించాడు. టోర్నీలో జట్టు అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్‌ చేశాడు.

శుక్రవారం ఉదయమే టోర్నీకి హర్భజన్‌ దూరమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అవన్నీ నిజమేనని భజ్జీ సాయంత్రం ట్విటర్‌ ద్వారా ధ్రువీకరించాడు. ఈ సీజన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు కష్టంగానే ఉండనుంది. ఆ బృందంలో 13 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పటికే సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్ రైనా జట్టుకు దూరమయ్యాడు. దుబాయ్‌ నుంచి భారత్‌కు వచ్చేశాడు.

సీనియర్లు లేకపోవడంతో ఉన్న కొద్ది మంది ఆటగాళ్లపైనే భారం ఎక్కువగా పడనుంది. యూఏఈలోని వేడి, ఉక్కపోతను తట్టుకుంటూ విరామం లేకుండా మ్యాచులు ఆడటం సవాలే. భజ్జీ ఉండుంటే పియూష్‌ చావ్లా, ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ శాంట్నర్‌కు భారం తగ్గేది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని