close

తాజా వార్తలు

Updated : 28/11/2020 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాగబాబు కౌంటర్‌పై ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు మధ్య మాటల యుద్ధానికి తెరలేచినట్టే కనబడుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలపై పవన్‌ ‌సోదరుడు నాగబాబు దీటుగా స్పందించారు. ‘మీకు భాజపా నచ్చకపోతే విమర్శించండి.. అంటూనే మీకు హర్షించగలిగే మనసులేదు’ అంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా, జనసేన పొత్తు సత్తా చాటబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. అయితే, నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌.. మాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘మీ తమ్ముడి మీద  మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. అయితే.. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరూ అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు. కానీ.. మీ భాష రాదు’ అంటూ తెలుగులో ట్వీట్‌ చేశారు.
ఇది చదవండి..

పవన్‌పై ప్రకాశ్‌రాజ్‌ విమర్శ‌.. నాగబాబు కౌంటర్‌!

 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని