close

తాజా వార్తలు

Published : 11/12/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయ్‌ దేవరకొండకు ముద్దుపెడతా: తమన్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవకాశం వస్తే టాలీవుడ్‌ హీరోల్లో ‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండకు ముద్దుపెడతానని మిల్కీబ్యూటీ తమన్నా తన మనసులోని మాట బయటపెట్టింది. ‘ఆహా’ ఓటీటీ వేదికగా సమంత వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ‘సామ్‌జామ్‌’ కార్యక్రమానికి తమన్నా విచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. సమంత కొంటె ప్రశ్నలు.. తమన్నా సరదా సమాధానాలు అలరించేలా ఉన్నాయి.

‘‘మీరు పోయెమ్స్‌(పద్యాలు) రాస్తారట నిజమేనా..?’ అని సమంత అడగ్గా.. తమన్నా స్పందిస్తూ.. ‘ఎప్పుడైనా నా గుండె పగిలితే.. ఒక్కోసారి నేను రచయిత్రిగా మారుతా..’ అని సమాధానం చెప్పింది. అయితే.. ‘మీ గుండెను గాయపరిచిన ఆ వ్యక్తి ఎవరో చెప్పండి’ అంటూ సమంత ఆటపట్టించింది. ‘నో కిస్సింగ్‌ ఆన్‌స్క్రీన్‌ రూల్‌ బ్రేక్‌ చేస్తే ఎవర్ని ముద్దు పెట్టుకుంటారు’ అని ప్రశ్నించగా.. ఏమాత్రం ఆలోచించకుండా  ‘విజయ్‌ దేవరకొండ’ అని తమన్నా బదులిచ్చింది. ఆ సమాధానంతో కార్యక్రమం నేరుగా చూస్తున్న ప్రేక్షకులు ఈలలు వేసి గోల చేశారు.

‘అఖిల్‌ మీకంటే వయసులో కాస్త చిన్నవాడు’ అని సమంత అంటే.. ‘ప్రేమకు వయసుతో సంబంధం లేదు’ అని తమన్నా చెప్పింది. ‘మీరు కోరుకుంటే నేను మీటింగ్‌ ఏర్పాటు చేస్తా.. వాళ్ల నాన్నతో కూడా మాట్లాడతా’’ అని సమంత(నవ్వుతూ) హామీ ఇచ్చింది. ఆ తర్వాత వీళ్లిద్దరికీ తోడుగా డైరెక్టర్‌ నందినీరెడ్డి వచ్చి చేరారు. ముగ్గురూ కలిసి కాసేపు సందడి చేశారు.

ఇదీ చదవండి..

చేదువార్త చెప్పి.. కంటతడి పెట్టిన రానా
Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని