బన్నీ, విజయ్‌ ఏం తింటారో తెలుసుకోవాలి: హృతిక్‌
close

తాజా వార్తలు

Updated : 04/03/2020 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ, విజయ్‌ ఏం తింటారో తెలుసుకోవాలి: హృతిక్‌

ముంబయి: బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌ దక్షిణాది స్టార్స్‌ అల్లు అర్జున్‌, విజయ్‌ డ్యాన్స్‌ను మెచ్చుకున్నారు. అంతేకాదు వీళ్లిద్దరూ డ్యాన్స్‌ చేయడానికి ముందు ఏ సీక్రెట్‌ డైట్‌ పాటిస్తున్నారని, దాన్ని తెలుసుకోవాలని ఉందని సరదాగా అన్నారు. హృతిక్‌ తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాల గురించి ముచ్చటించారు. ‘ఇటీవల కాలంలో విడుదలైన ఒక్క దక్షిణాది సినిమాను కూడా నేను చూడలేకపోయా. కానీ, ఇక్కడి సినిమాల్లో టెక్నాలజీని వాడే తీరుకు నేను వీరాభిమానిని. ఇక్కడి నుంచి దాన్ని మేం నేర్చుకోవచ్చు. సాధారణంగా నేను ఓ ప్రాజెక్టును ఎంచుకునేటప్పుడు.. ఒక్క ప్రశ్న లేకుండా ఓకే చెప్పేలా ఉండాలి. కథ నాకు చాలా నచ్చితే 30 సెకన్లలో ఓకే చేస్తా. నేను 30 సెకన్లలో ఓకే చెప్పకపోతే.. ఇక ఆ సినిమాలో నటించననే అర్థం. నేను చేసిన చాలా సినిమాల్ని ఇంత వ్యవధిలోనే అంగీకరించా. నా మనసు, శరీరం, ఆత్మ ఏం చెబుతుందో అదే చేస్తుంటా’.

‘డ్యాన్స్‌ చేయడానికి ఎంతో సాధన అవసరం. ఆపై దాని ఫలితాన్ని వదిలేయాలి. ఆస్వాదిస్తూ డ్యాన్స్‌ చేయాలి. నువ్వు నటుడివైతే ముఖంలో భావాల్ని పలికించాలి. ఎందుకంటే మనం డ్యాన్స్‌ను ఎంజాయ్‌ చేస్తే ముఖంలో ఆ ఫీలింగ్స్‌ కనిపిస్తాయి.. అప్పుడు మూమెంట్స్‌ తప్పైనా సమస్యే ఉండదు’ అని హృతిక్‌ చెప్పారు.

అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ గురించి ప్రశ్నించగా.. ‘ఎనర్జిటిక్‌, స్ఫూర్తిదాయకం, స్ట్రాంగ్‌’ అని అన్నారు. విజయ్‌ గురించి అడగగా.. ‘నాకు తెలిసి వీరు రహస్యంగా ఏదో తింటున్నారు. ఎందుకంటే రోజూ అదే ఉత్సాహంతో ఉంటారు. డ్యాన్స్‌కు ముందు వీళ్లు ఏం తింటారో తెలుసుకోవాలని ఉంది’ అని హృతిక్‌ పేర్కొన్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని