
తాజా వార్తలు
హార్వర్డే ఆదర్శం...అహో ఐఐఎం!
ఇంటర్నెట్ డెస్క్ : ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని తలపించే నమూనా. రూ. ఎనిమిది వందల కోట్లకు పైగా ఖర్చు. ఆచార్యులు విద్యార్థులకు ఫైవ్ స్టార్ వసతులు. అన్నింటనీ మించి పచ్చదనానికి ప్రతిబింబంగా నిలిచే ప్రాంగణం. విశాఖలో ఏర్పాటు అవుతున్న అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థ ఐఐఎం విశేషాలివి. విశాఖ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకువెళ్లేలా ఆశలు రేపుతున్నాయి.
241.5 ఎకరాల్లో....
విశాఖ నగర శివారులోని గంభీరంలో ఐఐఎంను ప్రపంచస్థాయి ప్రమాణాలు ఐఐఎంను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి దీటుగా ఇందులో సౌకర్యాలు కల్పించనున్నారు. షాపోర్జీ పల్లోంజీ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. 241.5 ఎకరాల్లో ఈ ప్రాంగణాన్నీ అత్యంత సుందరంగా నిర్మించేందుకు విస్త్రతంగా కరసత్తు చేశారు అధికారులు.భవనాల్లో సదుపాయాలకు సంబంధించిన 18వందల డ్రాయింగ్స్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. దిల్లీకి చెందిన ‘ఆర్కాప్’ డిజైన్లను రూపొందించింది.
807.69 కోట్లతో...
ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ నిర్మాణానికి రెండు దశల్లో రూ.807.69 కోట్లు ఖర్చు చేయనున్నారు. అందులో భాగంగా మొదటి దశలో రూ.392.48 కోట్లతో 600 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా అన్ని వసతులు సమకూరుస్తున్నారు. రెండో దశ కూడా పూర్తయిన తరువాత మొత్తం లక్షా 15వేల 8 వందల చ.మీ విస్తీర్ణంలో తరగతి భవనాలు ఇతర వసతులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 1170 మందికి ఇక్కడ విద్యాబోధన చేయనున్నారు.
ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా....
విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే వసతిగృహాల్లో ప్రతీ గదిలోనూ ఏసీ, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఓవెన్ లాంటివి ఎన్నో ఏర్పాటు చేయనున్నారు. ఐఐఎంలో పాఠాలు చెప్పేందుకు దేశవిదేశాల నుంచి విద్యావేత్తలు, ప్రముఖులు వస్తారు. వారికోసం 60 గదులతో ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపించేలా అతిథి గృహం నిర్మిస్తారు. ఇక్కడి తరగతి గదులు ఆధునికతకు చిరునామాగా నిలవనున్నాయి. ఇందుకోసం హార్వర్డ్ను ఆదర్శంగా తీసుకుని డిజైన్లు రూపకల్పన చేశారు. దానికి మరింత ఆధునికతను జోడించారు. తరగతి గదిలో విద్యార్థులు యూ ఆకారంలో కూర్చుంటారు. ఈ గదుల్లో అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలు ఉంటాయి. ఆచార్యులు పాఠం చెప్పటం మొదలు పెట్టారంటే సెన్సర్ల ఆధారంగా స్పీకర్లు వాటంతట అవే పనిచేస్తాయి. విద్యార్థుల మాటలు కూడా ఈ స్పీకర్లలో వినిపించేలా తీర్చిదిద్దనున్నారు. అంతేకాదు మాట్లాడుతున్న విద్యార్థి ఫొటో దానంతట అదే బోర్డుపై కనిపిస్తుంది. ఆచార్యులు బోధించే పాఠాలన్నీ రికార్డు అవుతాయి. రికార్డు చేసిన నాటి నుంచి పదిహేను రోజుల పాటు విద్యార్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి. దీని వల్ల ఆయా పాఠ్యాంశాలను విద్యార్థులు ఎన్ని సార్లయినా వినవచ్చు.
శాస్త్రీయంగా పచ్చదనం....
ఇందులో వందసీట్ల తరగతి గదులు 10, 50 సీట్లవి 10, అదనంగా మరో 5 గదులు అందుబాటులో ఉంటాయి. ఆచార్యుల కోసం 117 కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. ఇవే కాకుండా ఐఐఎంలో పచ్చదనానికీ పెద్దపీట వేయనున్నారు. 7,200 మొక్కలతో ఈ ప్రాంగణం అలరారనుంది. ఏటా సుమారు 1920 టన్నులకు సమానమైన బొగ్గుపులుసు వాయువును పీల్చుకునేలా శాస్త్రీయమైన విశ్లేషణలతో నాటాల్సిన మొక్కల సంఖ్యను ఖరారు చేశారు. పర్యావరణానికి అత్యంత అనుకూలమైన నిర్మాణాలకు లభించే గృహ ఫైవ్ స్టార్ రేటింగ్‌కు అనుగుణంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. ఐఐఎంను తీర్చిదిద్దేందుకు పలు ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించామని, తదనుగుణంగా మెరుగైన డిజైన్లను ఖరారు చేశామని సంచాలకులు ఎం చంద్రశేఖర్ తెలిపారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- 2-1 కాదు 2-0!
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
