close
Array ( ) 1

తాజా వార్తలు

మూడో టీ20:టీమిండియాలో మూడు మార్పులు

పుణె: భారత్‌ X శ్రీలంక జట్ల మధ్య తుదిపోరుకు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో మలింగ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో భారత్‌ ఈ సిరీస్‌లో తొలిసారి ఓపెనింగ్‌ చేయనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా రెండో మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2-0తేడాతో 2020లో శుభారంభం చేయనుంది. మరోవైపు రెండో టీ20లో ఓటమిపాలైన శ్రీలంక.. మూడో మ్యాచ్‌లోనైనా విజయం సాధించి సిరీస్‌ సమం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇదిలా ఉండగా టీమిండియా ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. శివమ్‌దూబె, రిషభ్‌ పంత్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ల స్థానాల్లో  సంజూ శాంసన్‌, మనీశ్‌ పాండే, యుజువేంద్ర చాహల్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, సంజు శాంసన్‌ (కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకుర్‌, నవ్‌దీప్‌ సైని, బుమ్రా, చాహల్‌

శ్రీలంక జట్టు: దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా(కీపర్‌), ఒషాడ ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డి సిల్వ, డసున్‌ షనక, లక్షణ్‌ సందకన్‌, వానిండు హసరంగ, లసిత్‌ మలింగ(కెప్టెన్‌), లాహిరు కుమారు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.