close

తాజా వార్తలు

Published : 12/11/2020 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ వ్యూయర్‌షిప్‌ అదుర్స్‌!

28% పెరిగిందన్న బ్రిజేశ్‌ పటేల్‌

ముంబయి: ఐపీఎల్‌-2020 అంచనాలను మించి అలరించిందని లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ అన్నారు. గతంతో పోలిస్తే 28% అధికంగా వ్యూయర్‌షిప్‌ లభించిందని పేర్కొన్నారు. కొవిడ్‌-19 వల్ల వందల మందితో బయో బుడగను ఏర్పాటు చేసి పొట్టి క్రికెట్‌ వేడుకను నిర్వహించడం సవాల్‌గా అనిపించిందని వెల్లడించారు. టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన డ్రీమ్‌11కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా వ్యూయర్‌షిప్‌కు సంబంధించిన గణాంకాలను ఇంకా విడుదల చేయలేదు.

కరోనా వైరస్‌ వల్ల ఐపీఎల్‌ 13వ సీజన్‌ను యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి మళ్లీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి ట్రోఫీ అందుకొని తిరుగులేని రికార్డులు సృష్టించింది.

‘అభిమానులకు ప్రపంచస్థాయి క్రీడా వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌11 రావడంతో ఫాంటసీ క్రీడల ద్వారా అభిమానులతో సాంగత్యం మరింత పెరిగింది. మ్యాచ్‌ కౌంట్‌డౌన్‌, యాక్టివేషన్‌, ఛాంపియన్‌ ఫ్యాన్స్‌వాల్‌, వర్చువల్‌ గెస్ట్‌బాక్స్‌ ద్వారా వారితో అనుబంధాన్ని మరింత పెంచింది’ అని బ్రిజేశ్‌ అన్నారు. ముంబయి, రాజస్థాన్‌ సైతం ఆన్‌లైన్‌ వేదికల ద్వారా అభిమానులకు చేరువయ్యాయి.

ఇవీ చదవండి

దంచికొడితే బంతే భయపడింది

టీ20 పోల్‌: ఏ జట్టుకు ఎన్ని మార్కులు?



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని