close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 20/04/2020 04:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాగ్నిజంట్‌పై రాన్సమ్‌వేర్‌ దాడి

దిల్లీ: ‘మేజ్‌’ రాన్సమ్‌వేర్‌ దాడితో ఇబ్బందులకు గురైనట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజంట్‌ వెల్లడించింది. దీని వల్ల తమ ఖాతాదారుల్లో కొంతమందికి అందించే సేవలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. కాగ్నిజంట్‌ కంపెనీకి భారత్‌లో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్న సంగతి తెలిసిందే. ‘మేజ్‌’ రాన్సమ్‌వేర్‌ దాడికి సంబంధించిన సమాచారాన్ని కాగ్నిజంట్‌ తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు చేరవేయడంతో పాటు వారికి రక్షణాత్మక సాంకేతికత అందించినట్లు తెలిపింది. ప్రముఖ సైబర్‌ రక్షణ సంస్థలతో అనుసంధానమైన తమ అంతర్గత భద్రతా బృందాలు ఈ దాడిని నిరోధించడానికి చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు కాగ్నిజంట్‌ స్పష్టం చేసింది. ఖాతాదారులు తమ కంప్యూటర్‌ వ్యవస్థ, డేటాను వినియోగించకుండా రాన్సమ్‌వేర్‌ అడ్డుపడుతుంది. వినియోగించుకోవాలంటే, డబ్బులు చెల్లించాలని అక్రమార్కులు డిమాండ్‌ చేస్తుంటారు. దీనిపై చట్టపరమైన చర్యలకూ కాగ్నిజంట్‌ సిద్ధమవుతోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.