సోనూసూద్‌ ట్వీట్‌.. ఆ గిరిజనులకు పీవో హామీ!
close

తాజా వార్తలు

Published : 26/08/2020 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూసూద్‌ ట్వీట్‌.. ఆ గిరిజనులకు పీవో హామీ!

విజయనగరం: ప్రముఖ సినీనటుడు, ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ సాలూరు గిరిజనులను అభినందిస్తూ చేసిన ట్వీట్‌కు విజయనగరం జిల్లా అధికారులు స్పందించారు.  సాలూరు మండలంంలోని చింతామల గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ పర్యటించారు. రూ.10లక్షలతో గిరిజనులు సొంతంగా నిర్మించుకున్న రహదారిని పరిశీలించారు. రహదారి నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రహదారితో పాటు తాగునీరు, విద్యా, వైద్య వసతులు కల్పిస్తానని భరోసా ఇచ్చారు.

సాలూరు మండలంలోని మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి 4కి.మీల మేర రహదారి నిర్మాణం చేపట్టిన గిరిజనులను సోనూసూద్‌ అభినందించిన విషయం తెలిసిందే. యావత్‌ దేశాన్ని మీ స్ఫూర్తి ప్రేరేపిస్తుందని కొనియాడారు. మీ ప్రేరణ దేశం మొత్తం అనుసరించాలని.. అందరం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేద్దామంటూ సోనూసూద్‌ పిలుపునిచ్చారు. త్వరలో కొదమ గ్రామాన్ని సందర్శించనున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని