close
Array ( ) 1

తాజా వార్తలు

కివీస్‌ ‘సూపర్‌ఓవర్లలో’అతడో ప్రత్యేకం

ఆ మూడు మ్యాచ్‌లకు వ్యాఖ్యాత ఒక్కడే

హామిల్టన్‌: క్రికెట్‌లో గత ఏడు నెలల్లో మూడుసార్లు సూపర్‌ ఓవర్‌కు వెళ్లిన జట్టు న్యూజిలాండ్‌ ఒక్కటే. ఈ మూడింటిలోనూ ఆ జట్టు ఫలితం కూడా ఓటమిపాలవ్వడమే. ఇంకా విచిత్రమేమంటే ఆ మూడు మ్యాచ్‌లకు వ్యాఖ్యాత కూడా ఒక్కరే. ఆయనే కివీస్‌ మాజీ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ స్మిత్‌. న్యూజిలాండ్‌ గతేడాది జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో ఫైనల్లో తలపడింది. తొలుత ఇరు జట్లు 241 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా మారింది. అనంతరం సూపర్‌లోనూ కివీస్‌, ఇంగ్లాండ్‌ చెరో 15 పరుగులు చేశాయి. అయితే, బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లీష్ జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో కివీస్‌ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనుకున్న కల.. కలగానే మిగిలిపోయింది. 

గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌ గడ్డపై జరిగిన ఐదు టీ20ల సిరీస్ చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌, కివీస్‌ జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలుత 146/5 స్కోర్‌ చేయగా ఛేదనలో ఇంగ్లాండ్‌ 146/7 పరుగులే చేసింది. అనంతరం జరిగిన సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ 17 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు 8 పరుగులకే పరిమితమైంది. దీంతో విలియమ్సన్‌ జట్టు మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది. ఇక గురువారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 179/5 పరుగులు చేయగా కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది. సూపర్‌ ఓవర్‌లో రోహిత్‌ చివరి రెండు బంతులకు సిక్సులు బాది జట్టును గెలిపించడంతో పాటు సిరీస్‌ను కైవసం చేశాడు.  

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాక.. స్మిత్‌ కామెంట్రీ చేస్తూ ‘ఈ సూపర్‌ ఓవర్‌ కూడా సమమైతే, నేను రిటైరైపోతా. ఎన్నో ఏళ్ల నా జీవితాన్ని కోల్పోతా. ఈ ఆటను ఎంతో ఆస్వాదించా. చాలా చాలా ఆనందించా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సూపర్‌ ఓవర్లు తమకు కలిసిరావని చెప్పాడు. నిజం చెప్పాలంటే మ్యాచ్‌ ఫలితాన్ని ఇక్కడి వరకు తీసుకురాకుండా ముందే పూర్తి చేయాలని తెలిపాడు. ఆఖరి ఓవర్‌లోనే విజయాన్ని అందుకోకపోవడం సిగ్గుచేటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఇవీ చదవండి:

 కివీస్‌.. మీ క్రీడా స్ఫూర్తికి శెభాష్‌

‘భారత్‌ మాతా కీ జై’ అంటున్న కివీస్‌ అభిమాని


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.