close

తాజా వార్తలు

Updated : 11/07/2020 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

24 గంటల్లో 27,114 కేసులు..519 మరణాలు..

దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 27,114 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,20,916కి చేరింది.519 మంది చనిపోయారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2,83,407 మంది చికిత్స పొందుతుండగా.. 5,15,386 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 22,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని