close

తాజా వార్తలు

Published : 01/11/2020 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీలకర్ర-బెల్లంతోనే కాజల్‌ పెళ్లి

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ కథానాయిక కాజల్‌, తను ప్రేమించిన గౌతమ్‌ కిచ్లూను శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన రెండు చిత్రాలను కాజల్‌ తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తమ పెళ్లి జరిగిన తీరును వివరించింది.

‘‘పంజాబీ వచ్చి కశ్మీరీని వివాహం చేసుకుంది. అయితే ఇందులో మేము తెలుగు వివాహ సంప్రదాయమైన జీలకర్ర-బెల్లం కూడా తీసుకొచ్చి కలిపాం. ఎందుకంటే గౌతమ్‌కు, నాకు దక్షిణాదితో ఎంతో అనుబంధం ఉంది. తెలుగు వివాహాల్లో జీలకర్ర-బెల్లంకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ తంతుతోనే పెళ్లి కుమార్తె-కుమారుడు వివాహ బంధంతో ఒక్కటవుతారు. జీలకర్ర-బెల్లాన్ని కలిపి ముద్దలా చేసి తమలపాకుపై ఉంచి ముహూర్త సమయానికి వేద మంత్రాల నడుమ వధూవరులు ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. ఆ తర్వాతే వధూవరులు ఒకరినొకరు చూసుకుంటారు. సుఖ దుఃఖాల్లో ఎప్పుడూ కలిసి ఉంటారని చెప్పే పవిత్ర వేడుక’’అని జీలకర్ర-బెల్లం విశిష్టతను పంచుకున్నారు కాజల్‌.

‘నా విశ్వాసపాత్రుడు, చెలికాడు, స్నేహితుడు, నా అంతరాత్మతో నా వివాహం జరిగింది. మిస్‌ కాజల్‌ను మిస్సెస్‌ కాజల్‌ అయ్యాను. ఇవన్నీ నీలో దొరకడం చాలా సంతోషంగా ఉంది కిచ్లూ’ అని మరో ఫొటోను షేర్‌ చేశారు ‘చందమామ’.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని