close
Array ( ) 1

తాజా వార్తలు

IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

తిరుపతి: లాక్‌డౌన్‌తో పనులు లేక పస్తులుండే పేదల ఆకలిని తిరుమల తిరుపతి దేవస్థానం తీరుస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని పేదలకు రెండు పూటలా ఆహారం అందించే ఏర్పాటు చేసింది. సుమారు 40 వేల మందికి సరిపోయే శ్రీవారి అన్నప్రసాదాన్ని తిరుపతి శ్రీనివాసం భక్తుల సముదాయంలో తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.


హైదరాబాద్‌: కూకట్‌పల్లి వై జంక్షన్‌ పోలీస్‌ చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శుక్రవారం తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం కార్మికులను తీసుకొస్తున్న ఆర్టీసీ బస్సును ఆపి పరిశీలించారు. బస్సులో సుమారు 60 మంది కార్మికులు ఉన్నారు. సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇంత మందిని ఎందుకు ఎక్కించుకున్నారని డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చిన వాహనదారుల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 


విజయవాడ కనకదుర్గా వారధి వద్ద లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నిబంధనలు పాటించని వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం వాటిని తిరిగి ఇస్తామని ప్రకటించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తాడేపల్లిలోని స్పందనం మైదానానికి తరలిస్తున్నారు.


చిన్నారికి దగ్గరుండి తండ్రితో మాస్క్‌ కట్టిస్తున్నది పోలీసులు కాదు.. ఆర్టీసీ ఉద్యోగులు. లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజలు సరిగా పాటించేలా ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటోంది. వీరంతా బ్యాంకులు, రైతు బజార్లు వద్ద సామాజిక దూరం పాటించేలా జనానికి అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం బ్యాంకులకు సెలవు కావడంతో పోలీసులతో కలిసి ఆర్టీసీ ఉద్యోగులు ట్రాఫిక్‌ నియంత్రణలో పాల్గొన్నారు. విజయవాడ వన్‌టౌన్‌లో ద్విచక్ర వాహనంపై చిన్నారితో వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆపి.. మాస్క్‌ లేకుండా బయట తిరగొద్దని చెప్పి మాస్క్‌ అందజేశారు.


హైదరాబాద్‌: బేగంబజార్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని యువకులను హెచ్చరిస్తున్న పోలీసు.


హైదరాబాద్‌: తన పుట్టిన రోజు సందర్భంగా ఆబిడ్స్‌లో పేదలకు ఆహార పొట్లాలను అందజేస్తున్న యువకుడు


గుంటూరు నగరంలో శుక్రవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఇదీ పరిస్థితి. గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ఎనిమిది ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అరండల్‌ పేట వారధిని ట్రాఫిక్‌ పోలీసులు మూసివేశారు. దీంతో టూ టౌన్‌ నుంచి వన్‌ టౌన్‌కు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నామని ప్రకటించిన పోలీసులు.. అత్యవసర సేవల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని సైతం నిలువరించారు. క్రమక్రమంగా వాహనాల సంఖ్య పెరగడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రోగులను ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్సులకు సైతం దారి దొరకలేదు. దీంతో రోగుల బంధువులు కన్నీటిపర్వంతమయ్యారు. చివరకు సమాచారం తెలుసుకున్న జిల్లా అధికారులు రాకపోకలకు అనుమతించారు.


మహారాష్ట్ర కరాడ్‌లో హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి పాడైన కూరగాయలను పశువులకు వేసేందుకు తీసుకెళ్తున్న యువకులు.


 లాక్‌డౌన్‌ కారణంగా చేసేందుకు పని లేకపోవడంతో రోజూవారి కూలీలు ఆకలి బాధకు గురవుతున్నారు. శుక్రవారం జమ్మూలో విధుల్లో ఉన్న పారామిలటరీ గార్డును యాచిస్తున్న కూలీలను చిత్రంలో చూడొచ్చు.


శుక్రవారం చెన్నైలోని కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌కు లారీల్లో వచ్చిన ఉల్లి, అరటి గెలలను దించుతున్న హమాలీలు.


ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనదారుడుని హెచ్చరిస్తున్న పోలీసులు.


జమ్మూలోని గుజ్జర్‌ నగర్‌ ప్రాంతంలో రహదారిపై తిరుగుతున్న వారిని ఇంట్లోనే ఉండాలని కోరుతూ నమస్కరిస్తున్న పోలీసు అధికారి.


కర్నూలులో పలు ప్రాంతాలను ప్రభుత్వం రెడ్‌ జోన్లుగా ప్రకటించినా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. బుధవారపేట, వన్‌ టౌన్‌ ప్రాంతాల్లో పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా ప్రజలు బయటకు రావడం మానలేదు.


హైదరాబాద్‌: బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వాహనదారుల్లో కొందరికి జరిమానా విధించారు. మరికొందరి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


కోల్‌కతా: ఓ వైపు కరోనా వైరస్‌ భయం.. మరోవైపు లాక్‌డౌన్‌ ఉన్నా పొట్ట కూటి కోసం రిక్షా లాగుతున్న వ్యక్తి.


గువాహటి: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడితో గుంజీలు తీయిస్తున్న పోలీసులు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.