సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుందాం:మోదీ
close

తాజా వార్తలు

Updated : 04/06/2020 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుందాం:మోదీ

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌తో ఆన్‌లైన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై సమీక్షించారు. సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ...భారత్‌, ఆస్ట్రేలియాలు పరస్పర సహకారంతో ఎదుగుతాయని ఆకాంక్షించారు.  ఆస్ట్రేలియాతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మకంగా మలచుకుందామని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా బయటపడాల్సిన అవసరముందన్నారు. సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలచుకుందామని పిలుపునిచ్చారు. వాణిజ్య, రక్షణ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు.

ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ మాట్లాడుతూ.. ఇండో ఫసిపిక్‌ రీజియన్‌లో పరస్పరం కలిసి పనిచేద్దామని సూచించారు. ఇరుదేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక ఒప్పందాలు సంతోషదాయకమన్నారు. ఈ సమావేశం ఇరు దేశాల మద్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని మోరిసన్‌ ఆకాంక్షించారు.

ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ ఈ ఏడాది జనవరిలోనే భారత్‌ పర్యటనకు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో ఏర్పడ్డ భారీ కార్చిచ్చు కారణంగా అది మే నెలకు వాయిదా పడింది. అనంతరం కరోనా వైరస్‌ ప్రభావంతో తాజాగా ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌లో పర్యటించాలని మోరిసన్‌ను నరేంద్ర మోదీ కోరారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని