close

తాజా వార్తలు

Published : 17/11/2020 20:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌ ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తిని విశ్వసిస్తుంది..

దిల్లీ: భారత్ విస్తరణవాద దేశం కాదని, ప్రపంచ సంక్షేమాన్ని మాత్రమే నమ్ముతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. మంగళవారం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ..స్వావలంబన సాధించడానికి విజ్ఞానం, వ్యాపార దక్షత, సైన్స్, సాంకేతికత, పరిశోధన వంటివి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పరోక్షంగా చైనా తీరును ఎండగడుతూ, ప్రపంచశక్తిగా మారడానికి నాణ్యమైన విద్య అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. 

‘దేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నప్పుడు, శాస్త్రీయ పురోగతిపై దృష్టిపెట్టాలి. విజ్ఞానంతో మన దేశాన్ని ప్రపంచ శక్తిగా మలచడానికి ప్రయత్నించాలి. ఈ తరహాలో ముందుకు వెళ్తున్నప్పుడు మనం విస్తరణ వాదులం కాదు. కానీ కొన్ని దేశాలు విస్తరణవాద కాంక్షతో రగిలిపోతుంటాయి. భారత్ మాత్రం ప్రపంచ సంక్షేమంపై మాత్రమే విశ్వాసం ఉంచుతుంది. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తిని విశ్వసిస్తుంది’ అని గడ్కరీ అభిప్రాయపడ్డారు. అలాగే  విద్యాపరంగా నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందని, విలువ ఆధారిత విద్యపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రపంచ స్థాయి విద్యావ్యవస్థలను రూపొందించే సామర్థ్యం భారత్‌కు ఉందని తెలిపారు. విద్యను వ్యాపారంగా మార్చిన వ్యక్తులు బుల్లెట్ రైలులా దూసుకెళ్తుంటే, నిస్వార్థంగా పనిచేస్తున్నవారు ప్యాసింజర్ రైలు మాదిరిగా వెళ్తున్నారని ప్రస్తుత పరిస్థితులను వెల్లడించారు. మన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలంటే దిగుమతులు తగ్గించుకొని, ఎగుమతులు పెంచాల్సి ఉందన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన