close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/05/2020 08:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘బలంగా మారేందుకు ఇదో అవకాశం’

కేంద్ర భారీ ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామిక వర్గాలు

ముంబయి: కొవిడ్‌-19 సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. దీన్ని ఓ అనూహ్యమైన నిర్ణయంగా అభివర్ణించిన కొందరు.. భారత వాణిజ్యం కొత్త పుంతలు తొక్కేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మార్పు దిశగా సాగేందుకు ఇదే సరైన సమయమని..ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి ప్యాకేజీ అందడం ఎంతో దోహదం చేస్తుందన్నారు. మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

ఈ సంక్షోభం నుంచి ఎలాగొలా ‘బతకాలి’ అన్న చర్చ నుంచి ‘బలం’గా మారుదాం అన్న దిశగా సాగడానికి ఇదొక మంచి అవకాశం. ప్యాకేజీపై బుధవారం ఆర్థిక మంత్రి ఇచ్చే వివరాలను బట్టి ఇది 1991 నాటి చరిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోతుందో.. లేదో.. చెప్పొచ్చు.         

 - ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ 

ఆధునిక సాంకేతికతతో సరఫరా గొలుసును బలోపేతం చేయాలన్న ప్రతిపాదన ఈ ప్యాకేజీలో చాలా కీలకమైన అంశం. స్థానికతకు పెద్దపీట వేయాలన్న ప్రధాని పిలుపుతో దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరగనుందని అర్థమవుతోంది. అందుకనుగుణంగా దేశీయంగా వస్తువుల తయారీ, వినియోగానికి భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు ఉంటాయని ఆశిస్తున్నాం

     - ప్రవీణ్‌ ఖండేల్వాల్‌, సీఏఐటీ సెక్రటరీ జనరల్‌

ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ చాలా కీలకమైంది. సమాజంలోని అన్ని వర్గాలు, రంగాలను కలుపుకొనిపోతూ స్వావలంబన సాధించాలన్న పిలుపు అందరూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యం సాకారమయ్యేందుకు ప్రతిఒక్కరూ కలిసి పనిచేస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన  బాధ్యత మనందరిపై ఉంది.

       - దిలీప్‌ చెనోయ్‌, ఫిక్కీ సెక్రటరీ జనరల్‌

ఈ రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ.. కరోనా సంక్షోభం నుంచి బయటపడేయడంతో పాటు దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరిచేందుకు దోహదపడుతుంది. అలాగే ఉపాధి కోల్పోయిన అనేక మందికి తిరిగి ఉద్యోగాలకు కల్పించడంతో పాటు వారికి మెరుగైన, భద్రతతో కూడిన వసతుల్ని కల్పించేందుకు ఉపయోగపడుతుంది. 

        - నిషా బిస్వాల్‌, యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.