పుల్వామాదాడి మా విజయం: పాక్‌
close

తాజా వార్తలు

Updated : 29/10/2020 18:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుల్వామాదాడి మా విజయం: పాక్‌

దిల్లీ: పాకిస్థాన్‌ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కింది. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్‌ ప్రజల విజయమని ఆదేశ మంత్రి ఫవద్‌ ఛౌధురీ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పాక్‌ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు. ‘భారత్‌ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం. పుల్వామాలో విజయం సాధించాం. ఇమ్రాన్‌ నాయకత్వంలో పాక్‌ విజయం సాధించింది. మనమంతా ఆ విజయంలో భాగస్వాములం’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ వ్యవహారంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా వణికినట్లు ఆ దేశ ప్రతిపక్ష ఎంపీ అయాజ్‌ సాధిక్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఘటనను సమర్థించుకుంటూ ఫవద్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. 

పుల్వామా ఘటన అనంతర పరిణామాల్లో భారత వైమానిక వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ సైన్యానికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన విడుదల వ్యవహారంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా, విదేశాంగ మంత్రి ఖురేషీకి మధ్య జరిగిన సంభాషణను పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్‌)నేత అయాజ్‌ సాధిక్‌ పార్లమెంటులో వెల్లడించారు. వర్ధమాన్‌ను విడుదల చేయకపోతే భారత్‌ తమ దేశంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని ఖురేషీ చెప్పినట్లు.. ఆ సమయంలో బజ్వా కాళ్లు వణికినట్లు అయాజ్‌ వెల్లడించారు. దీంతో అయాజ్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అమరులు అయ్యారు. 

పాక్‌ ఆర్మీ జనరల్‌ వణికిన వేళ..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని