close
Array ( ) 1

తాజా వార్తలు

కృత్రిమ మేధలో భవిష్యత్తు భారత్‌దే:విశాల్‌సిక్కా

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారత్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఎదిగే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ మాజీ సీఈఓ విశాల్‌ సిక్కా అభిప్రాయపడ్డారు. అయితే దీనికి ఏఐని విద్యావ్యవస్థలో చేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల ఆయన 50మిలియన్‌ డాలర్ల నిధులతో వియానై సిస్టమ్స్‌ పేరిట ఓ ఏఐ అంకుర సంస్థను నెలకొల్పారు. ఆటోమేషన్‌ రంగంలో భవిష్యత్తులో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైన మేర విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తే ఏఐలో భారత్‌ ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. పిటీఐ వార్తాసంస్థకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. 

గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు నీతి ఆయోగ్‌ ముందు ‘కృత్రిమ మేధను భారత్‌లో విస్తరించడం ఎలా’ అన్న దానిపై విశాల్‌ సిక్కా ప్రదర్శన ఇచ్చారు. దాదాపు 20మందికి పైగా కేంద్ర మంత్రులు దీనికి హాజరయ్యారు. డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ తరహాలో ఏఐ విస్తరణను కూడా ఉద్యమ స్థాయిలో చేపపట్టాల్సిన అవసరం ఉందని విశాల్‌ అభిప్రాయపడ్డారు. రానున్న 20సంవత్సరాలు కృత్రిమ మేధదేనని.. దీంట్లోని అవకాశాల్ని భారత్‌ ఒడిసిపట్టుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో నిబద్ధతతో ఉందని ఆయన తెలిపారు. ఏఐపై పరిశ్రమ వర్గాలు, విద్యా సంస్థల్లో అవగాహనే లక్ష్యంగా వియానై సిస్టమ్స్‌ ప్రారంభించామని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.